Header Banner

రాష్ట్ర ఉద్యోగుల నియామక పరీక్షల షెడ్యూల్ విడుదల! ఏపీపీఎస్సీ కీలక ప్రకటన!

  Fri Apr 18, 2025 16:30        Education

రాష్ట్రంలోని ప్రభుత్వ శాఖలకు చెందిన పలు పోస్టుల భర్తీకి ఉద్దేశించిన పరీక్షల తేదీలను ఏపీపీఎస్సీ ప్రకటించింది. తాజా షెడ్యూల్‌ ప్రకారం.. అసిస్టెంట్ కెమిస్ట్, అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ ఉద్యోగాల నియామక కంప్యూటర్ ఆధారిత పరీక్షలు ఏప్రిల్ 28, 29 తేదీల్లో వేర్వేరుగా జరగనున్నాయి. గిరిజన సంక్షేమ శాఖ అధికారి నియామక కంప్యూటర్ ఆధారిత పరీక్ష ఏప్రిల్‌ 28, 30 తేదీల్లో జరగనుందని ఏపీపీఎస్సీ కార్యదర్శి రాజబాబు ఏప్రిల్‌ 16న ఓ ప్రకటనలో తెలిపారు. క దివ్యాంగులు, ట్రాన్స్‌ జెండర్లు, సీనియర్‌ పౌరుల సంక్షేమ శాఖలో అసిస్టెంట్‌ డైరెక్టర్‌ పోస్టుల రాత పరీక్షను ఏప్రిల్‌ 27, 28 తేదీల్లో నిర్వహించనున్నారు.
ఏప్రిల్ 27న మధ్యాహ్నం పేపర్‌ 2, 28న ఉదయం పేపర్‌ 1 పరీక్ష ఉంటుంది. రాష్ట్ర వైద్యారోగ్య శాఖలో లైబ్రేరియన్‌ పోస్టులకు ఏప్రిల్‌ 27న ఉదయం పేపర్‌ 2 పరీక్ష, ఏప్రిల్ 28న ఉదయం పేపర్‌ 1 పరీక్ష జరగనుంది. ఏపీ ఫిషరీస్‌ సర్వీస్‌లో ఫిషరీస్‌ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌ పోస్టుల మెయిన్స్‌ పరీక్షలో భాగంగా ఏప్రిల్ 28న ఉదయం పేపర్‌ 1 పరీక్ష, ఏప్రిల్‌ 30న ఉదయం పేపర్‌ 2 పరీక్ష, మధ్యాహ్నం పేపర్‌ 3 పరీక్ష జరగనుంది. ఎలక్ట్రికల్‌ ఇన్‌స్పెక్టరేట్‌లో అసిస్టెంట్‌ ఎలక్ట్రికల్‌ ఇన్‌స్పెక్టర్‌ పోస్టులకు రాత పరీక్ష ఏప్రిల్ 28న ఉదయం, మద్యాహ్న సమయాల్లో నిర్వహించనుంది. టౌన్‌ అండ్‌ కంట్రీ ప్లానింగ్‌ సర్వీస్‌లో అసిస్టెంట్‌ డైరెక్టర్‌ పోస్టుల పరీక్ష ఏప్రిల్‌ 28, 29 తేదీల్లో జరగనుంది. సీబీటీ విధానంలో జరిగే ఈ పరీక్షల హాల్‌ టికెట్లను అధికారిక వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని కార్యదర్శి రాజాబాబు చెప్పారు.


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:


ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్! కేంద్రం నుండి గ్రీన్ సిగ్నల్! ఆ జిల్లాలో ఎయిర్ పోర్ట్ నిర్మాణ సన్నాహాలు!

ప్రధాని మోదీ నివాసంలో కీలక భేటీ! నేషనల్ అధ్యక్షుడిపై క్లారిటీ! బీజేపీకి కొత్త కెప్టెన్ ఎవరంటే?

వైసీపీ నేతలకు పోలీసుల వార్నింగ్! తిరుపతిలో హైటెన్షన్,సవాల్ విసిరిన..!


ప‌వ‌న్ చేతికి సెలైన్ డ్రిప్‌.. అస‌లేమైందంటూ అభిమానులు ఆందోళ‌న వ్య‌క్తం!

చట్ట విరుద్ధ టారిఫ్‌లు.. ట్రంప్‌కు గవర్నర్ న్యూసమ్ వార్నింగ్! కాలిఫోర్నియా లీగల్ యాక్షన్!

ఇంటి కోసం హడావుడి.. కోర్టు కేసు మధ్య రాజ్ తరుణ్ తల్లిదండ్రుల డ్రామా! బోరున ఏడ్చిన లావణ్య!

టీటీడీ లో మరో కుంభకోణం.. పవిత్రతను కాలరాసినవారికి జైలే గతి! బీజేపీ నేత విచారణకు డిమాండ్!

వైసీపీకి భారీ షాక్.. రాజకీయాల్లోకి ఏబీ వెంకటేశ్వరరావు.. జగన్ అక్రమాలన్నీ బయటకు తెస్తా..

 

వారందరికీ పండుగ లాంటి వార్త.. ఆ జిల్లా చుట్టూ పెరగనున్న భూముల ధరలు! ప్రభుత్వం సంచలన నిర్ణయం!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #APPSC #JobNotifications #GovtJobsAP #APPSCExams #RecruitmentAlert #AndhraPradeshJobs